కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రిమాండ్..

నేటి ఉదయం నుంచి ఎన్నో హైడ్రామాల మధ్య కాసేపట్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

Update: 2024-11-13 11:53 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : నేటి ఉదయం నుంచి ఎన్నో హైడ్రామాల మధ్య కాసేపట్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరుపరచనున్నారు. లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ఫోన్లో మాట్లాడి దాడికి ప్రోత్సహించినట్టు బలమైన ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈ కారణంగా నరేందర్ రెడ్డిని నేటి ఉదయం హైదరాబాదులో అరెస్టు చేసి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు, అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి, వికారాబాద్ నుంచి మళ్లీ పరిగి, అక్కడి నుంచి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టులో హాజరు పరచనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయవద్దని, అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు.

Tags:    

Similar News