ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమ్..

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తున్న వికారాబాద్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.

Update: 2023-02-14 16:10 GMT

దిశ, మర్పల్లి : 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తున్న వికారాబాద్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు గడ్డం ప్రసాద్ కుమార్ ను వికారాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మీతో నేను కార్యక్రమంతో ప్రతి గ్రామంలో తిరుగుతూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పై మాజీ మంత్రి, సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న ప్రసాద్ కుమార్ లాంటి వ్యక్తి అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. నీ పార్టీ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మాకు అభ్యంతరం లేదని, కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మా ఎమ్మెల్యే 300 ఎకరాల సంపాదించాడని ప్రజలకు ఎలా చెబుతారు. ఎమ్మెల్యే పేరున 10 ఎకరాల భూమి ఉందని నిరూపించగలవా..? అన్నారు.

పులిమద్ది గ్రామానికి ఎమ్మెల్యే రాలేదు అనడం అవివేకం, ఈ గ్రామానికి తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి నేటి వరకు 10 నుండి 12 సార్లు రావడం జరిగింది. గ్రామా అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. కాబట్టి ఇకపై ఏదైనా ఆరోపణలు చేస్తే ఆధారాలతో చేయాలనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పులమద్ది సర్పంచ్ మాధవరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచుల సంఘము అధ్యక్షులు పురుషోత్తం, మైనారిటీ నాయకులు గయాజ్, గఫార్, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News