మీర్ పేట్ పెద్ద చెరువులో చేపలు మృతి

కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి.

Update: 2024-08-21 12:59 GMT

దిశ, మీర్ పేట్ : కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. బుధవారం ఉదయం అటు నుంచి వెళ్తున్న వాహనదారులు, పాదచారులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. చెరువులోని చేపలు కలుషిత నీటి వల్ల చనిపోయాయా లేకా ఇతర కారణాల వల్ల చనిపోయాయా అనే కోణంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    చేపలు మృతి చెంది నీటిపై తేలడంతో దుర్గంధం వెదజల్లుతుంది. అటు నుంచి వెళ్లే వాహనదారులు, వాకర్స్ వాసన భరించలేక పోతున్నారు. అధికారులకు ఉదయం సమాచారం అందించినా సాయంత్రం వరకు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారుల తీరు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News