రైతుల త్యాగమే జిల్లాకు అధిక పరిశ్రమలు : మంత్రి శ్రీధర్ బాబు

రైతుల పక్షపాతిగా,రైతు మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని

Update: 2025-03-17 07:02 GMT

దిశ,మహేశ్వరం : రైతుల పక్షపాతిగా,రైతు మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...దేశ చరిత్రలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.రాబోయే కాలంలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు.రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందిస్తామన్నారు.

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు.సాంకేతిక ఇబ్బందులు వల్ల రెండు లక్షల రుణమాఫీ కొద్దిగా ఆలస్యం జరిగిందన్నారు.రైతు రుణమాఫీ పై ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు.ప్రతిపక్షాల చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.రైతుల త్యాగ ఫలితామే రంగారెడ్డి జిల్లాకు అధిక పరిశ్రమలు వస్తున్నాయన్నారు.పరిశ్రమలకు భూములుస్తున్న రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి రైతుకు చేరాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి,మాజీ జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి,కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,మహేశ్వరం తహసీల్దార్ సైదులు,జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ రియాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి,ఏనుగు జంగారెడ్డి,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గం మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా సభావత్ కృష్ణ నాయక్,వైస్ చైర్మన్ చాకలి యాదయ్య,డైరక్టర్లు అంకగల్ల పుష్ప,బొమ్మకూరి ప్రశాంత్ కుమార్,యుగంధర్,అండేకార్ సురేందర్,కంబాలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,ఏం ఏ జావిద్,అల్లే భిక్షపతి,బోధ పాండురంగారెడ్డి,శివ గొల్ల యాదయ్య,కొత్త ధన్ పాల్ రెడ్డి,పిట్టల పాండు డైరక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.


Similar News