వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఉత్తిమాటే : డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి
వ్యవసాయానికి 24 నిరంతర ఉచిత విద్యత్ అందిస్తున్నామని గొప్పులు చెబుతున్నదంతా ఉట్టిమాటేనంటూ డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తప్పుపట్టారు.
దిశ, పరిగి : వ్యవసాయానికి 24 నిరంతర ఉచిత విద్యత్ అందిస్తున్నామని గొప్పులు చెబుతున్నదంతా ఉట్టిమాటేనంటూ డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పరిగి విద్యుత్ ఏడీ కార్యాలయం ముందు సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బహిరంగ సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ రైతుల పంటపొలాలకు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం అవాస్తవమన్నారు.
రైతులకు కేవలం 8 గంటలే విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే తన కృషివల్లే సోలార్, విండ్ పవర్ ఏర్పాటై పరిగి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చి దిద్దానన్నారు. నజీరాబాద్ 220/132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ చేయించి పనులు పూర్తై విద్యుత్ సరఫరా అవుతున్నా నేటికి సబ్ స్టేషన్ను ప్రారంభించలేదని దౌర్బాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ, స్థానిక పాలుకులు ఉన్నారంటూ మండిపడ్డారు. దోమ మండలం కిష్టాపూర్ సబ్ స్టేషన్ మంజూరీ చేయించినా స్థలం కేటాయించకపోవడం వల్లే పనులు ప్రారంభం కావడం లేదన్నారు.
పరిగికి రానున్నరోజుల్లో హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వొస్తాయని వాటికి కరెంట్ సరఫరా కావాలి అంటే 400/220 కేవీ సబ్ స్టేషనల్ పరిగికి కావాలన్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు రావాలంటే కరెంట్ అవసరమని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కరెంట్ సబుస్టేషన్ లకు కృషి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్, పరిగి టౌన్ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరుశురాం రెడ్డి, ఆంజనేయులు, సురేందర్, ఆనెం ఆంజనేయులు, చిన్న నర్సింలు, వెంకటేష్, డి.అశోక్, శేషారెడ్డి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.