ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికలు : మంత్రి కేటీఆర్

మూడవసారి తెలంగాణ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని,100 సీట్లు గెలవడం పక్కా అని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

Update: 2023-11-05 15:12 GMT

దిశ,తలకొండపల్లి/ ఆమనగల్ : మూడవసారి తెలంగాణ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని,100 సీట్లు గెలవడం పక్కా అని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఆయనకు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.. ఈ సమావేశానికి వేలాదిమంది హాజరైయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 52,53 కిలోలు ఉన్న ఒక్క కేసీఆర్ ను ఢీకొట్టేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది షేర్లు, బబ్బర్ షేర్లు, ఫైల్ మాన్లు వస్తున్నారని వారిని తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి తీసుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బుల సంచులతో తిరుగుతున్నారని, ఓటర్లు డబ్బులు తీసుకోని ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను 30వేల మెజారిటీతో గెలిపించాలన్నారు.

కల్వకుర్తిలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని, రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయకుండా పారిపోయాడని, మీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కల్వకుర్తిలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే గట్టిప్పల పల్లి, వెల్జాల్, రఘుపతి పేటలను నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. గతంలో 2014 ముందు రాష్ట్రంలో కరెంటు లేక ఎవరైనా దాన సంస్కారాలు చేయాలంటే కరెంటును అడుక్కునే వారమని నేడు కరెంటు పోతే వార్త, ఆనాడు కరెంటు లేక వార్త అని ఎద్దేవా చేశారు.

అనంతరం అభ్యర్థి జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో 5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు,మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి,రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, జడ్పీటీసీలు అనురాధ, దశరథ్ నాయక్, విజిత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఏడ్మా సత్యం,ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ గౌడ్,వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, ఎంపీపీ నిర్మల, రాష్ట్ర సర్పంచుల సంఘము అధ్యక్షులు ఎల్ఎన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు అనంతరెడ్డి, ఆనంద్, ఆమనగల్ మండల మున్సిపాలిటీ అధ్యక్షులు అర్జున్ రావు, పత్య నాయక్, శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News