మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి

మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-09-14 13:07 GMT

దిశ, తుర్కయంజాల్ : మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 12 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాం రెడ్డి, వైస్ చైర్ పర్సన్ హరిత ధనరాజ్ గౌడ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.

     తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ భారత్ మిషన్ లో భాగంగా ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్చత హి సేవా కార్యక్రమ పోస్టర్ ను మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ, ఫ్లోర్ లీడర్ కోషిక ఐలయ్య, కమిషనర్ అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మాధవి మహేందర్ రెడ్డి, బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి, అనురాధ దర్శన్, కవిత శేఖర్ గౌడ్, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, నాయకులు మర్రి మహేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News