విద్యా, వైద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి : తలకొండపల్లి ఎంపీపీ నిర్మల

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అందించే విద్యా వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు.

Update: 2022-10-17 12:00 GMT

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అందించే విద్యా వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు. మండలంలో సోమవారం తలకొండపల్లి, గట్టు ఇప్పలపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాలలో డాక్టర్ శారద అధ్యక్షతన ఏర్పాటు చేసిన 57 మంది ఆశా వర్కర్లకు చీరల పంపిణీకి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిలు హాజరై చీరలను పంపిణీ చేశారు.

అనంతరం ఎంపీపీ నిర్మల మాట్లాడుతూ తలకొండపల్లి ఆస్పత్రిలో విధులు నిర్వహించవలసిన ఒక వైద్యుడు ఇక్కడ జీతం తీసుకుంటూ వేరే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడని, గట్టు ఇప్పలపల్లి ఆసుపత్రిలో పనిచేసే వైద్య అధికారి ఇటీవల బదిలీపై వెళ్లిపోవడంతో ఆ పోస్టు గత ఐదు నెలలుగా ఖాళీ ఏర్పడిందని ఆమె పేర్కొంది. ఆస్పత్రిలో డాక్టర్ లేకపోతే రోగులకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు లలిత జ్యోతయ్య, జయమ్మ వెంకటయ్య, హెల్త్ అసిస్టెంట్లు రామచంద్రయ్య, మల్లయ్య, సూపర్వైజర్లు మల్లీశ్వరి, రవికుమార్, ఏఎన్ఎంలు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News