అంచెలంచెలుగా గ్రామాల్లో అభివృద్ధి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

అంచెలంచెలుగా గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం అని

Update: 2024-07-03 11:13 GMT

దిశ,శంషాబాద్ : అంచెలంచెలుగా గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో 1.23 కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సీసీ రోడ్డు, గౌడ సంఘం నూతన భవనాన్ని బుధవారం ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వీ రాజ్ లతో కలిసి ప్రారంభించి, గౌడ సంఘం భవనం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో గతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలు కూడా అప్పుడు మంజూరైన నిధులతో నిర్మించినవే అన్నారు.

ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిందని ఈ ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తే ఎంతో బాగుంటుందన్నారు. శంషాబాద్ మండలం పూర్తిగా గ్రామీణ ప్రాంతమని ఇక్కడ 111 జీరో ఉండడం వల్ల నిధుల కొరత ఉందని, గ్రామాల్లో మరింత అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల కొరకు పాటుపడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ప్రజలు ఎప్పుడు మరువరు అన్నారు .నర్కుడ గ్రామంలో గౌడ సోదరులందరూ ఎన్నో సంవత్సరాల నుండి గౌడ సంఘం భవనం నిర్మించాలని కోరడంతో నిధులు కేటాయించడం తో నిర్మాణం పూర్తై ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం అన్నారు. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

గౌడ సోదరుల కొరకే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాల కొరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్,డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీష్, ఎంపిటీసి గౌతమి అశోక్,ఎంఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓ మున్ని,ఎంపీఓ ఉషాకిరణ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, నాయకులు నీరటి రాజు,కుమార్ గౌడ్, యాదగిరి గౌడ్, శ్రీనివాస్, విశ్వనాథం, శేఖర్,శ్రీకాంత్ గౌడ్, అనిల్ గౌడ్,దండు ఇస్తారి,రవి నాయక్, ప్రభు సాగర్,శివాజీ, మహేష్,నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News