చిత్రపురిలో కొనసాగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌ కూల్చివేతలు

మణికొండ మున్సిపాలిటీలోని చిత్రపురిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు.

Update: 2024-08-21 09:41 GMT

దిశ‌, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీలోని చిత్రపురిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. మున్సిపల్ పరిధిలోని చిత్రపురి కాలనీలో విల్లాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. కాగా టౌన్ ప్లానింగ్ అధికారులు సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో ఆ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

    కాగా కూల్చివేత‌ల స‌మ‌యంలో అధికారుల‌కు, సొసైటీ స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్వాదం కొన‌సాగింది. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు మాట్లాడుతూ.. కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడిదే సహించేది లేదన్నారు. ఎక్కడ అక్రమంగా నిర్మాణాలు జరిగినా సత్వరమే తమకు తెలియజేయాలన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి అక్రమ నిర్మాణం పై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.  

Tags:    

Similar News