డీఎస్సీ–2008 అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనకు నిర్ణయం
డీఎస్సీ–2008 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, రంగారెడ్డి బ్యూరో : డీఎస్సీ–2008 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా విద్యాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు పొందుపరిచారు. అందులోనున్న అభ్యర్థులు మాత్రమే ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్ రావు తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలని సూచించారు.