దళితుల ఆర్థిక పురోభివృద్ధికి దళిత బంధు : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
దళితుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పేర్కొన్నారు.
దిశ, ఆమనగల్లు : దళితుల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన యూనిట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందజేశారు. ఆమనగల్లు పట్టణానికి చెందిన వస్ఫూల రాములుకి కారు, తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలుకు మంజూరైన ఆటోమొబైల్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల ఆర్థిక పురోభివృద్ధికి దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శమన్నారు. అనంతరం మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షులు పత్య నాయక్ పెళ్లిరోజు,వైస్ ప్రెసిడెంట్ పూసల భాస్కర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మండల అధ్యక్షులు అర్జున్ రావు, కౌన్సిలర్ సోనా జయరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్, మైనారిటీ నాయకులు ఖలీల్, నాయకులు బాలస్వామి, శివకుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.