bomb threat : విమాన ప్రయాణాలు అంటేనే భయపడుతున్న ప్రయాణికులు..
ప్రతిరోజు విమానాలను పేల్చేస్తా అంటూ బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు అధికారులు తీవ్ర ఆధ్వర్యంలో గురవుతున్నారు.
దిశ, శంషాబాద్ : ప్రతిరోజు విమానాలను పేల్చేస్తా అంటూ బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు అధికారులు తీవ్ర ఆధ్వర్యంలో గురవుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జాతీయ, అంతర్జాతీయ విమానాలు రోజుకు వందలాది విమానాలు నడుస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య విమానాలకు బెదిరింపు కాల్స్ రావడంతో విమాన ప్రయాణికులతో పాటు ఎయిర్ లైన్స్ అధికారులు కూడా ఎప్పుడు ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో అని భయపడిపోతున్నారు. ఎక్కువగా డొమెస్టిక్ విమానాలకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. విమానాలే టార్గెట్గా మెసేజ్లు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీనితో ప్రయాణికులు విమాన ప్రయాణం అంటేనే భయపడుతూ, బుక్ చేసుకున్న టికెట్లను సైతం క్యాన్సల్ చేసుకుంటున్నారు.
గత పది రోజుల నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజుకు నాలుగు నుండి ఐదు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 10 రోజులుగా దాదాపు 50 విమానాలకు. రోజు బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్ తో తనిఖీలు నిర్వహించాకే విమానాలను అనుమతిస్తున్నారు. ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏర్పోర్ట్ లోకి అనుమతిస్తున్నారు. ఏర్పోర్ట్ కు వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా స్కానింగ్ చేసి తనిఖీలు చేస్తున్నారు.
ఆర్జీఐఏ సీఐ బాలరాజు మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గత పది రోజుల నుండి దాదాపు 50 విమానాలకు బెదిరింపు మెసేజ్లు వచ్చాయని ఎక్కువగా ట్విట్టర్ ద్వారా వివిధ దేశాల నుండి మెసేజ్లు పంపుతున్నారన్నారు. రోజుకు నాలుగు ఐదు విమానాలకు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 10 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.