కలెక్టర్ ప్రతీక్ జైన్ కు పరామర్శల వెల్లువ..
వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మంగళవారం పరామర్శల వెల్లువ మొదలైంది.
దిశ, ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మంగళవారం పరామర్శల వెల్లువ మొదలైంది. ఐఏఎస్ 2017 బ్యాచ్ కు చెందిన ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకునే కంటే ముందు రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా పని చేశారు. వ్యక్తిగతంగా తన మంచి పనితీరుతో రంగారెడ్డి జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కలెక్టర్ ప్రతీక్ జైన్ ను చీఫ్ సెక్రటరీతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సొంత బ్యాచ్ ఐఏఎస్ లు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.