స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మార్పు..!
స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకా శం ఉంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకా శం ఉంది. స్ధానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏ ర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. కేవ లం ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్వేయడమే మిగిలి ఉంది. కానీ రాష్ట్ర ప్రభు త్వం రాజకీయంగా, ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పెంపొందించేందుకు నిర్ణయం తీసు కుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఒకే దఫాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పంచాయతీ రాజ్ చట్టం–2018 గత ప్రభుత్వం తీసుకొచ్చినా ఈ ప్రభుత్వం రెండు ఒకే దఫా ఆమోదం జరిగేలా రిజర్వేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సవరణ బిల్లు–2024కు అసెంబ్లీలో ఆమోదం పొందింది.
ఇప్పటికే సేవా కార్యక్రమాల్లో నిమగ్నం..
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే నాయకులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు నాయకులు విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది గతంలోనున్న రిజర్వేషన్లు కొనసాగనున్నాయనే ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో కాలు కు గిరుకలు కట్టుకొని తిరుగుతున్నా రు. అంతేకాకుండా వాళ్లు అటు ప్రజల కు దగ్గర కావడానికి సేవా కార్యక్రమాలు చేస్తూ.. మరోవైపు పార్టీ నేతలను ఆకర్షించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓ ప్రణాళికతో పా ర్టీలు వ్యూహాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల మనస్సులో ఆందోళన మొదలైంది. రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్‌తో చాలా మంది పంథాను మార్చుకుంటున్నారు.
ఎస్టీల తర్వాతే..
రిజర్వేషన్ ప్రక్రియకు ప్రథమంగా ఎస్టీ ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఎస్టీ రిజర్వేషన్ఖరారు చేస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగానే రొటేషన్‌లో కేటాయిస్తారు. ఈ లెక్కన రంగారెడ్డిలో 21, వికారాబాద్‌లో 20 మండలాలున్నాయి. అంటే 21 జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే ఎస్టీకి రిజర్వ్అయి పదవీ కాలం ముగియడంతో తిరిగి ఎస్టీకే అవకాశం వచ్చే అవకాశం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఆమన్ గల్లు, తలకొండపల్లి, మాడ్గుల, మం చాల, కందుకూర్ మండలాలు.. వికారాబాద్‌జిల్లాలో బొంరాస్‌పేట్, యాలాల్, దుద్యాల మండలాల్లో అ త్యధికంగా ఎస్టీలు ఉండే అవకాశం ఉంది. ఈ మండలాలు గిరిజన ప్రాం తాలకు అండగా ఉంటాయి. ఇక్కడి నుంచే మొదటగా ఎస్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పిస్తారు. ఆ తర్వాతే ఎస్సీ, బీసీ, ఎస్సీలకు సీట్లను కేటాయించే అవకాశం ఉంది. జిల్లాలోని ఆయా స్థానాల వివరాలు..
జిల్లా జడ్పీటీసీ ఎంపీటీసీ జీపీలు వార్డు మెంబర్లు
రంగారెడ్డి 21 232 531 4710
వికారాబాద్ 20 227 594 5058