పేదవారికి సైతం సన్న బియ్యం : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పేదవారు సైతం మూడు పూటలా కడుపునిండా సన్న బియ్యం అన్నం

దిశ,పరిగి : పేదవారు సైతం మూడు పూటలా కడుపునిండా సన్న బియ్యం అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు.పరిగి మండలం మాదారం గ్రామంలో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచిస్తుంది. కాబట్టే ముందుగా కొన్నేళ్లుగా రేషన్ కార్డు లేక అవస్థలు పడుతున్న వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డులు కల్పించిందన్నారు .పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కనీసం ఇంట్లో పుట్టిన వారి పేర్లను కూడా ఆడ్ చేయాలని దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే కొత్త రేషన్ కార్డులు అందించి పేర్లు లేని వారి కుటుంబీకులను యాడ్ చేసే అవకాశం కల్పించిందన్నారు.
ప్రతి కుటుంబం సోనామసూరి బియ్యం తినాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించామన్నారు అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులకు సోనామసూరి బియ్యాన్ని పంపిణీ చేశారు . ఈ.సన్న బియ్యం లో పోష్టిక పదార్థాలు అందాలనే ఉద్దేశ్యంతో మినరల్స్ కలిపినట్లు ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలో 2,395 కొత్త రేషన్ కార్డులో పేర్లను యాడ్ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 7 కోట్లు రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. సన్నవడ్లకు బోనస్ ఇచ్చి పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాస్తు చంద్ర , జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రమోహన్ , మోహన్ బాబు ఎమ్మార్వో ఆనందరావు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురాం రెడ్డి , వైస్ చైర్మన్ అయోబ్, మాదారం మాజీ సర్పంచులు చిలకమర్రి వెంకటయ్య, నర్సింలు, రేషన్ డీలర్ వీరారెడ్డి, బద్రి గారి రాజ్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.