ప్రభుత్వ భూమి కబ్జా.. వారిపై చర్యలు లేనట్లేనా?

‘ఇది ప్రభుత్వ భూమి’ అని బోర్డులు ఏర్పాటు చేసి సుమారు నెల కావస్తున్నా.. ఇప్పటి వరకు శాశ్వత చర్యల దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2025-04-20 02:41 GMT
ప్రభుత్వ భూమి కబ్జా.. వారిపై చర్యలు లేనట్లేనా?
  • whatsapp icon

దిశ, ఇబ్రహీంపట్నం:‘ఇది ప్రభుత్వ భూమి’ అని బోర్డులు ఏర్పాటు చేసి సుమారు నెల కావస్తున్నా.. ఇప్పటి వరకు శాశ్వత చర్యల దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా దారుల చెర నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన బోర్డులను సదరు కబ్జాదారులు తొలగించారు. ఇది జరిగి కూడా నెల కావస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ కేంద్రంలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో సర్వే నెం. 80 లోని 33 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు ప్రభుత్వం గతంలో ఇవ్వగా వారు అమ్ముకున్నారు. జేబీ వెంచర్ 12 ఎకరాలు, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు ఎకరాల పైన ఉన్నట్టు, మిగతా భూమిని రియల్ వ్యాపా రులు కొనుగోలు చేసి పక్కన ఉన్న సర్వే నెం. 67 ఆధారంగా హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీ వెంచర్లు చేశారని మొత్తం 33 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించిన అధికారులు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పుష్పలత, సర్వేయర్ సాయి కృష్ణ రెడ్డి బోర్డులు ఏర్పాటు చేశారు. 8 చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.

శాశ్వత చర్యలు తీసుకుంటాం..

పై అధికారుల సూచన మేరకు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పోతాం. వారి నుంచి ఆదేశాలిస్తూ చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ అధికారులకు ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వాలని లిఖిత పూర్వకంగా లెటర్ పంపాం. : -సునీత రెడ్డి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్

Similar News