రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లను పూడ్చి వేస్తున్న యజమానులు
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను
దిశ,అబ్దుల్లాపూర్మెట్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కోట్లలో నష్టపోయిన యజమానులు రోడ్డున పడిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పరీక్షలు చేసి బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తో పాటు చిట్యాల మండల పరిధిలోని ఒక కోళ్ల షెడ్లు సంబంధించిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం పరిధిలోని కొత్తగూడెంలో ఓ రైతులకు సంబంధించిన కోళ్ల షెడ్డులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో ఇప్పటికే 17 వేల పైగా కోళ్లను పూడ్చి వేశారు.
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎన్ హెచ్ 65 విజయవాడ జాతీయ రహదారి వెంట ఉన్న పలు కోళ్ల షెడ్లలో ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తిస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధోతి గూడెంలో గల ఒ కోళ్ల ఫారంతో పాటు చిట్యాల మండలం గుండ్రంపల్లి లో గల షెడ్డులో కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం. కాగా ఆయా ప్రాంతాల అధికారులు తగిన సూచనలు చేస్తూ చనిపోతున్న కోళ్లను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పూర్తి వేస్తున్నట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ పూర్తిగా పోయింది అని గుర్తించాకనే తిరిగి కోళ్ల ఫారాల కు అనుమతులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కోట్లలో యజమానులకు నష్టం వస్తునట్లు తెలుస్తోంది.
బాగా ఉడికించి చికెన్ తినండి : వెటర్నరీ అధికారి నరసింహారావు
చికెన్ ను ప్రజల తినాల్సి వస్తే బాగా ఉడికించిన తర్వాతనే తినాలని సూచించారు. బర్డ్ ఫ్లూ వంటి వైరస్ సోకిన ప్రాంతాలను గుర్తించి కోళ్లను అక్కడికి అక్కడే పూడ్చి వేస్తూ యజమానులకు తగిన సూచనలు చేస్తున్నాం. అబ్దుల్లాపూర్మెట్ మండలం తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సోకుతున్నట్లు తమకు సమాచారం ఉందని వీటిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నాం.