బస్ స్టాప్ లో చైన్ స్నాచింగ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఇంద్రారెడ్డి నగర్ బస్తీకి చెందిన డి సత్యవతి రాజేంద్రనగర్ వెళ్లడానికి బుద్వేల్ బన్సీలాల్ నగర్ చౌరస్తాలో బస్ కోసం వేచి చూస్తుంది.

Update: 2022-10-03 15:49 GMT

దిశ, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఇంద్రారెడ్డి నగర్ బస్తీకి చెందిన డి సత్యవతి రాజేంద్రనగర్ వెళ్లడానికి బుద్వేల్ బన్సీలాల్ నగర్ చౌరస్తాలో బస్ కోసం వేచి చూస్తుంది. అదే సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు.

సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుస్తెలతాడు లాక్కున్న దుండగుడు బస్ స్టాప్ వెనుకాల ఉన్న పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ లోకి దూకి పారిపోయారని బాధితురాలు తెలిపారు.

Tags:    

Similar News