నేను పార్టీ మారితే ఉరి తీయండి : మనోహర్ రెడ్డి

నేను కాంగ్రెస్ గుర్తు పై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళితే నన్ను ఉరి తీయండి అని డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు.

Update: 2023-10-26 14:42 GMT

దిశ, తాండూరు : నేను కాంగ్రెస్ గుర్తు పై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళితే నన్ను ఉరి తీయండి అని డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్‌ ల సమక్షంలో గురువారం తాండూరు మండలం అంతారం, చెంగోల్ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ రత్నమాల రాము, నేతలు, రాము అతని అనుచరులు హస్తం గూటికి చేరారు. వారిని కండువా కప్పి కాంగ్రెస్ లోకి మనోహర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కు 137 ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో మంది త్యాగాలతో కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.

రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతివంటి అనేక హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. అవినీతి బీఆర్ఎస్ వైపు ఉంటే కాంగ్రెస్ సంక్షేమం వైపు నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే ఆరు గ్యారెంటీ, పథకాలను పక్కాగా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జి. రాందాస్, గోపాల్ రెడ్డి, మల్లప్ప, ఉదయ్ బాస్కర్ రెడ్డి, రాము ముదిరాజ్, యాదయ్య గౌడ్, యూత కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్, రాము, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News