శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

విమానాశ్రయంలో బాంబు పెట్టామని ఫోన్ కాల్ రావడంతో తీవ్ర

Update: 2024-01-21 15:06 GMT

దిశ,శంషాబాద్ : విమానాశ్రయంలో బాంబు పెట్టామని ఫోన్ కాల్ రావడంతో తీవ్ర కలకలం సృష్టించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ లైన్ ఫోన్ కు గుర్తు తెలియని ఆగంతకుడు విమానాశ్రయంలో బాంబు పెట్టామని ఫోన్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఒక్కసారిగా అధికారులు అంత ఉలిక్కిపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ఎయిర్పోర్ట్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు, డాగ్స్ క్వాడ్,బాంబు స్క్వాడ్, క్లూస్ టీం తో ముమ్మరంగా నిర్వహించారు. ఎక్కడ ఏమి లభించకపోవడంతో ఫోన్ కాల్ ఫేక్ గా గుర్తించి ఫోన్ నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News