అభివృద్ధి చేశా ఆశీర్వదించండి : మంచిరెడ్డి
అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మరొక మారు గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరారు.
దిశ, యాచారం : అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మరొక మారు గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ రజిత రాజు నాయక్ లతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన అశేష జనవాహిని మధ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చౌదర్ పల్లి, అయ్యవారిగూడెం, గ్రామాలలో రోడ్ షోలతో పాటు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో చేశారని గుర్తు చేశారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతుబంధు బంద్ చేస్తారని హెచ్చరించారు. 5 ఏళ్లలో 3 వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి త్రాగునీరు, అనేక అభివృద్ధి కళ్ల ముందే కనబడుతోందని వివరించారు. ఓడిపోతామనే భయంతోనే ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ అల్లరి సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ళు జంగమ్మ యాదయ్య, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, పాచ్చ భాష, పిఎసిఎస్ చైర్మన్ తోటి రెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచ్ నాయిని నర్సిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొల్లంపల్లి వెంకటేష్, కోలం అనంతరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.