అక్రమ ఇసుక ఫిల్టర్స్ పై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం..

మండలంలోని చెన్నారం, జంగారెడ్డిపల్లి, ఎడవెల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమ ఇసుక డంపులను ద్వంసం చేసినట్లు తహసిల్దార్ కృష్ణ తెలిపారు.

Update: 2023-03-03 15:17 GMT

దిశ, తలకొండపల్లి : మండలంలోని చెన్నారం, జంగారెడ్డిపల్లి, ఎడవెల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమ ఇసుక డంపులను ద్వంసం చేసినట్లు తహసిల్దార్ కృష్ణ తెలిపారు. శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక ఫిల్టర్స్ ద్వారా ఇసుక తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా గ్రామాల్లో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించగా ఐదు చోట్ల అక్రమ ఇసుక తయారు చేసే ఇసక కుప్పలు, ఫిల్టర్స్ దొరికాయని పేర్కొన్నారు.

ఇక ముందు అక్రమ ఫిల్టర్ ఇసుకను తయారు చేసిన వ్యక్తులపై, పొలాల్లో పోసుకున్న వ్యక్తులపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేపడతాయని ఆయన హెచ్చరించారు. ఇసుక ఫిల్టర్స్ ను ధ్వంసం చేసి కరెంటు మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి మండలంలో అక్రమ ఇసుక ఫిల్టర్స్ అరికట్టడానికి మూడు ప్రత్యేక టీములను మండలంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ టీంలు ప్రతిరోజు పర్యవేక్షిస్తాయని తహసిల్దార్ కృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీటీ సంతోష్, ఆర్ఐ మంజుల, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పట్టుబడిన తీసుక కుప్పలకు రేపు వేలం..

మండలంలోని ఆయా గ్రామాల్లో అక్రమంగా తయారు చేస్తున్న ఇసుకదిప్పలను గుర్తించిన అధికారులు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తహసిల్దార్ కార్యాలయంలో యాక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాక్షన్ లో పాల్గొనే వ్యక్తులు ఎవరైనా ప్రభుత్వ పరంగా పనులు చేసే వర్క్ ఆర్డర్స్ కాపీని తీసుకురావాలని తహసిల్దార్ కృష్ణ పేర్కొన్నారు.

Tags:    

Similar News