సర్కార్ బడిలో ప్రైవేట్ టీచర్.. ఏ రోజు ఏ టీచర్ వస్తారో తెలియని పరిస్థితి
ర్కార్ బడిలో ప్రైవేట్ ఉపాధ్యాయుడు చేత బోధిస్తున్నారు. విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన 14 రోజులవుతున్నా ఇప్పటికీ పలువురు ఉపాధ్యాయులు బడికి వస్తున్నారు.
దిశ, తాండూరు: సర్కార్ బడిలో ప్రైవేట్ ఉపాధ్యాయుడు చేత బోధిస్తున్నారు. విద్యార్థులకు పాఠశాల ప్రారంభమైన 14 రోజులవుతున్నా ఇప్పటికీ పలువురు ఉపాధ్యాయులు బడికి వస్తున్నారు. దీంతో ఏ రోజు ఏ ఉపాధ్యాయుడు వస్తాడో..తెలియని పరిస్థితి నెలకొంది. తాండూరు మండలం గుండ్లమదుగు తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి ప్రారంభం నుంచే సెలవులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో బుధవారం ప్రైవేట్ ఉపాధ్యాయుడు జమాలోద్దీన్ విధులు నిర్వహించాడు. సార్ మీరెవరు అని ప్రశ్నించిన దిశ విలేకరికి తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఆ ఉపాధ్యాయుడినని సమాధానం ఇచ్చారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ సీఆర్పీ చెప్పడంతో ఈ పాఠశాలలో బోధన సిబ్బందిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన స్థానిక ఎంపీటీసీ సీతాభాయ్, గ్రామస్తులు అక్కడికి చేరుకొని మాట్లాడారు.
పాఠశాల ప్రారంభమైన 14 రోజుల్లో పలువురు టీచర్లు మారారన్నారు. పాఠశాల సమీపంలోని ఇతరపాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్ల ఒక్కొక్కరు 2,3 రోజుల చొప్పున బోధన అందించారని తెలిపారు. అయితేప్రైవేట్ ఉపాధ్యాయుడు చేత పాఠాలు చెప్పిస్తూ .. పేద విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడడం ఏంటని మండిపడ్డారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి అసలు మా పాఠశాలకి వద్దని వారు డిమాండ్ చేశారు. బుధవారం విధుల్లో ప్రభుత్వ ఓ టీచర్ ఉండాలన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయన బదులుగా దినసరి కూలిగా ప్రైవేట్ టీచర్‌తో పాటలు చెప్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోజుకో టీచర్..!
స్థానిక ఎంపీటీసీ సీతా భాయ్ మాట్లాడుతూ.. రెండు వారాలుగా నలుగురు టీచర్లు మారారన్నారు. మరికొందరు ఇక్కడ తాత్కాలికంగానే విధులు నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ఏ రోజు ఏ టీచర్ ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేశారు.
సర్కార్ బడి శాపంగా మారేనా?
గుండ్లమదుగు తండా పాఠశాలలో సకాలంలో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఏ రోజు ఏ ఉపాధ్యాయుడుంటాడు తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో ఎలా పోటీపడగలరని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాలు లేకుండా ఎలా చదవాలని 4వ తరగతి విద్యార్థిని రాజేశ్వరి ప్రశ్నించింది. బడులు తెరిచి రెండు వారాలు దాటినా ఇప్పటికీ పుస్తకాల పంపిణీ చేయలేదు. రోజు పాఠశాల వస్తున్నాం. పుస్తకాలు లేకపోవడంతో ఖాళీగానే కూర్చుని పోతున్నాం. ఇంకా యూనిఫామ్ కూడా ఇవ్వలేదని, మాకు ఇవ్వాల్సిన రెండు దీంతో రంగురంగుల దుస్తులు, పేదలు చినిగిపోయిన డ్రస్సులతో పాఠశాలలకు వస్తున్నారుని 3వ తరగతి విద్యార్థిని అశ్విని తెలిపింది.