రాజేంద్రనగర్ లో 50.54% పోలింగ్

పార్లమెంటు ఎన్నికలు రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో రాజకీయ పక్షాలతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Update: 2024-05-13 14:38 GMT

 దిశ, రాజేంద్రనగర్ : పార్లమెంటు ఎన్నికలు రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో రాజకీయ పక్షాలతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటల వరకు 50.54% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. మరికొద్ది శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మందకొడిగా కొనసాగింది. ఉదయం వేళ వాతావరణం కాస్త చల్లగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

ఓటేసిన ప్రముఖులు

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రి పురం డివిజన్ ఫయాజ్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మైలార్దేవుపల్లిలో ఓటు వేశారు. నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి మైలార్దేవ్ పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పర్యవేక్షించిన కలెక్టర్

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని రాజేందర్ నగర్ లోని నారం గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రిటర్నింగ్ అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు. పార్లమెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల నియోజకవర్గంలో 18.49% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు 50.54 % నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఇంకా ఓటర్లు వేచి ఉండటంతో పోలింగ్ శాతం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.


Similar News