రంజాన్ ఎఫెక్ట్ : ఈ సీజన్‌లో కళ్లు చెదిరే రేంజ్‌లో బిర్యానీ సేల్స్!
హైదరాబాద్ అనగానే ఫుడ్ లవర్స్‌కి టక్కున గర్తొచ్చేది బిర్యానీ.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అనగానే ఫుడ్ లవర్స్‌కి టక్కున గర్తొచ్చేది బిర్యానీ. మన బిర్యానీకి దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. అయితే రంజాన్ మాసంలో ఎక్కువ మంది హలీం ను ఇష్టం గా తింటుంటారు. నగర వాసులతో పాటు, జిల్లా కేంద్రాల నుంచి వచ్చిన వారు సైతం హలీం టేస్ట్ చేయకుండా వెళ్లరు. అయితే ఈ సీజన్ లో బిర్యానీ సేల్స్ గతంలో తగ్గాయి. అయితే ఈ సారి మాత్రం ఆ ట్రెండ్ ను ఫుడ్ లవర్స్ బ్రేక్ చేశారు. ఒక్క స్విగ్గీలోనే రంజాన్ నెలలో వచ్చిన ఆర్డర్ లో అందుకు నిదర్శనం. 10 లక్షల బిర్యానీలను సిటీ జనం ఆర్డర్ ఇచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికమని పేర్కొంది. హలీంకు నెలరోజుల్లో 4లక్షల ఆర్డర్లు వచ్చాయంది. ఈ సారి హలీంలో మటన్, చికెన్, ఫిష్ తో పాటు పర్షియన్ స్పెషల్, పాలమూరు పొట్టేలు, డ్రైఫ్రూట్ లాంటివి అందుబాటులో ఉంచామని తెలిపింది.