రామోజీ రావు కన్నుమూత.. గత ప్రభుత్వంపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు(88) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు(88) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినిమా ఇండస్ట్రీలో, రామోజీ ఫిలిం సిటీ లో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరిలించి.. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. దీంతో సినీ నటుడు, మా ఆసోసియేషన్ మాజీ అధ్యక్షుడ రాజేంద్ర ప్రసాద్ రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు చివరి రోజుల్లో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఆ దేవుడు గమనించి చేసిన పాపానికి వెంటనే కర్మను ఇచ్చారు. చివరి రోజుల్లో ఆయనను అవమానించి వేదించిన వారి పతనం చూసి కన్నుమూశారని.. పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావును వైసీపీ ప్రభుత్వం దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన వెంటిలేటర్ పై ఉన్న సమయంలో కూడా విచారించింది. అలాగే తాను క్యాన్సర్ తో బాదపడుతున్నానని చెప్పినప్పటికి గత ప్రభుత్వం రామోజీరావుపై విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టిన విషయం తెలిసిందే.