రామోజీ ఫిలిం సిటీ పూర్తి వివరాలు.. ఆయనకున్న వేల కోట్ల ఆస్తులు ఎవరికి దక్కుతాయంటే?
తెలుగు పత్రికా ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రామోజీ రావు లేరనే బాధ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు పత్రికా ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రామోజీ రావు లేరనే బాధ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈయన పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ. ఇది 1996 లో స్థాపించబడింది. ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది. తరచూ జనాలు దీని గురించి వింటారు.. వెళ్తుంటారు. కానీ పూర్తి వివరాలు మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఫిలిం సిటీ మొత్తం 2000 ఎకరాలతో విస్తరించి ఉంది. ఇక్కడ సిటీలో సినిమా దృశ్యాలకు కావాల్సిన రకరకాల ఫిక్డ్స్ సెట్స్ ఎన్నో ఉన్నాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఎన్నో భాషా సినిమాలు, టీవీ సీరియల్స్ నిర్మించబడుతున్నాయి. ఇక ఉద్యానవనాలకైతే లెక్కేలేదు. మొత్తం ఫిల్మ్ సిటీ తిరిగా చూడాలంటే కనీసం వారం రోజులైన పడుతుంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్‌సిటీ ఇన్ ది వరల్డ్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది. ఈ ఫిల్మ్‌సిటీలో హాలీవుడ్ చిత్రాలు కూడా షూటింగ్ జరుపుకుంటాయి. సంవత్సరానికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ ను రామోజీరావు స్థాపించి ఎన్నో మూవీస్ చిత్రీకరించారు. ఫిల్మ్ సిటీలో ఇప్పటివరకు దాదాపు 2500 వరకు పైగా చిత్రాలు చిత్రీకరించినట్లు టాక్.
రామోజీ ఆస్తి వివరాలు చూసినట్లైతే..
ఈయనకు దాదాపు 46 వేల కోట్ల రూపాయల దాకా ఆస్తులున్నాయట. ఈ ఆస్తిని గతంలోనే ఇద్దరు కుమారులు పంచుకున్నారు. ఒక్కో సంస్థల బాధ్యతల్ని కొడుకు-కోడళ్లకు అప్పగించారు. కుమారులకు ఇవ్వగా తన భార్య మీదున్న ఆస్తి అలాగే ఉందని సమాచారం. మరీ ఈ ఆస్తి ఏ కుమారుడికి రాసిచ్చారో లేదో క్లారిటీకి తెలియదు.