Rakesh Reddy: మైసూర్ బోండాలో మైసూర్.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ ఉండవు!

మైసూర్ బోండాలో మైసూర్.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్(Congress Job Calendar) లో జాబ్స్ ఉండవని బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి(Enugula Rakesh Reddy) సంచలన విమర్శలు చేశారు.

Update: 2025-01-04 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్: మైసూర్ బోండాలో మైసూర్.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్(Congress Job Calendar) లో జాబ్స్ ఉండవని బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి(Enugula Rakesh Reddy) సంచలన విమర్శలు చేశారు. శనివారం తెలంగాణ భవన్(Telangana Bhavan) లో ఆయన మీడియాతో మాట్లాడతూ.. కొత్త సంవత్సరం వచ్చింది పాత క్యాలెండర్ మారుతుంది. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన పాత క్యాలెండర్ ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు. అలాగే పాత సంవత్సరంలో పండుగలు వచ్చాయి కానీ ఉద్యోగాలు రాలేదని, కాంగ్రెస్(Congress), టీజీపీఎస్సీ(TGPSC) ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ను పండగలతో నింపుతారా అని ప్రశ్నించారు.

హైకోర్టు క్యాలెండర్(High Court Calendar) కూడా రిలీజ్ అయ్యిందని, టీజీపీఎస్సీ క్యాలెండర్(TGPSC Calendar) ఎందుకు రిలీజ్ కాలేదని నిలదీశారు. బీహార్ క్యాలెండర్‌లో పండుగలతో పాటు జాబ్ డీటెయిల్స్ కూడా ఉంటాయని, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. కాంగ్రెస్ వాళ్లు రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్ లో జాబ్‌లు ఉండవని ఎద్దేవా చేశారు. మళ్లీ సిగ్గు లేకుండా గొప్పలు చెప్తూ గవర్నమెంట్ సొమ్ము కోట్లు వెచ్చించి న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు ఓడ దిగే దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అనే విధంగా ఉందని, ఈ సారైనా మీరు హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల జాబు డీటెయిల్స్‌తో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News