గుడ్ న్యూస్.. త్వరలోనే తెలంగాణలో మరో యూనివర్శిటీ ఏర్పాటు..!

తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-07-05 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాక్ సెంటర్ వద్ద మొత్వం 32 ఎకరాల విస్తీరణంలో స్కిల్ వర్సిటీ నిర్మిస్తామన్నారు. ఇక, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఫార్మా దిగ్గజాలు సీఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. రూ.32 వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.


Similar News