కేసీఆర్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

Update: 2023-01-26 12:29 GMT

దిశ,‌వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంటి? చస్తే ఏంటి అని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. పని చేయని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే బాగుచేసి మళ్లీ పంపారని మండిపడ్డారు. ప్రాణహాని దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని పోలీసులే చెబుతున్నారని.. ఇదే విషయమై పోలీసులు తనకు నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని మండిపడ్డారు.  


Similar News