బిగ్ అలర్ట్: రానున్న 24 గంటల్లో తెలంగాణలో వర్షం!
తెలంగాణ రాష్టంలో రానున్న 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్టంలో రానున్న 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మే 26, 27, 28 తేదీల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.