హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అలర్ట్
హైదరాబాద్ మహా నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నపలంగా వాతావరణం చల్లబడిపోయి చార్మినార్, ఫలక్‌నుమా, శాస్త్రిపురం సహా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నాలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కరెంట్ స్తంభాలను ముట్టుకోకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఏదైనా అత్యవసరం అయితే 100 కాల్ చేయాలని చెప్పారు. నగరంలోనే కాదు జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలులో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా, మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రైతాంగం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.