రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. అత్యధిక వర్షపాతం ఎక్కడంటే..?

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు వర్షం దంచికొట్టింది.

Update: 2024-07-15 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 15.83 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 11.08 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌లో 11 సెం.మీ, భూపాలపల్లి జిల్లా కొయ్యురులో 10.65 సెం.మీ, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 9.48 సెం.మీ, హైదరాబాద్ యూసఫ్ గూడలో 9.48 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా నవాబ్ పేటలో 8.48 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ షేక్ పేటలో 8.45 సెం.మీ, మారేడ్ పల్లిలో 8.4 సెం.మీ, ఖైరతాబాద్‌లో 8.4 సెం.మీ, ముషీరాబాద్‌లో 8.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో 7.93 సెం.మీ, హన్మకొండ దామెరలో 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా మొగ్డం పల్లిలో 7.43 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


Similar News