చల్లటి కబురు.. నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు. గత వారం రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నేడు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు

Update: 2023-08-12 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు. గత వారం రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నేడు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. కర్ణాటక నుండి కొమోరిన్ వరకు విస్తరించింది ద్రోణి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, హనుమకొండ, కామారెడ్డి, వరంగల్, సూర్యపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


Similar News