Rain Effect: హైదరాబాద్- విజయవాడ మధ్య స్తంభించిన రాకపోకలు.. ఆల్టర్‌నేట్ రూట్లు ఇవే!

రాష్ట్రంలో వరుణ దేవుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.

Update: 2024-09-02 02:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుణ దేవుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ప్రధాన రహాదారులు జలమయమయ్యాయి. చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి-65పై వరద నీరు పొంగిపొర్లుతోంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని‌గూడెం వద్ద పాలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా రామాపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కుప్పకూలింది. పరిస్థితులు భయానకంగా ఉండటంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసర, అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులు ఆల్టర్‌నేట్ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేవారు హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ వెళ్లాలని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేవారు హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ బంగ్లా, ఖమ్మం, మీదుగా వెళ్లాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు.


Similar News