Rain Alret: రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం.. రానున్న 48 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితర ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం వెంట కేరళ తీరం వరకు వ్యాపించింది.

Update: 2024-08-15 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితర ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం వెంట కేరళ తీరం వరకు వ్యాపించింది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ మేర ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అధికారులు వివరించారు. ఈ క్రమంలో గురువారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..