Rain Alert: తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ!

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మరోసారి దంచికొట్టనున్నాయి.

Update: 2024-08-29 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మరోసారి దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు- మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించినది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 30 నుంచి వచ్చే నెల 2వ తారీకు వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆగస్టు 30 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి.. అవేంటంటే?

పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, ఖమ్మం, మహబూబాబాద్​, వరంగల్​, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది.

ఆగస్టు 31 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి ..అవేంటంటే?

కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్​, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

1వ తేదీన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయి.. అవేంటంటే?

ఆదిలాబాద్​, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం పేర్కొంది.


Similar News