రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేం.. రాజ్యసభలో తేల్చిచెప్పిన కేంద్రం
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రైల్వేలకు ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే కోచ్‌ల తయారీ సామర్థ్యం ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీలకు ఉందని వివరించింది. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.