రాహుల్ గాంధీ బోధన్ పర్యటన.. నిరసిస్తూ భారీగా పోస్టర్లు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బోధన్ పర్యటన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి.

Update: 2023-11-25 04:35 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బోధన్ పర్యటన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే నిజామాబాద్, బోధన్‌లో గోడలకు పోస్టర్ల ప్రత్యక్షం అయ్యాయి. సంచలనం సృష్టిస్తున్న పోస్టర్లలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టి బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దే. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొని ఉన్న పోస్టర్లు గోడలకు అతికించారు. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే... ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేస్తూ పోస్టర్లలో రాతలు రాశారు.

పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టిన వైనాన్ని ముద్రించారు. పోస్టర్లలో బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాలు ఉదహరించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంటు లేక అల్లాడుతున్న కర్నాటక అని విమర్శ ఉన్నాయి. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరామా అని ఉన్న ప్రశ్నలు పోస్టర్‌పై రాశారు. కర్నాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే అంటూ రాతలు రాశారు. రాహుల్ గాంధీ రాక నిరసిస్తూ వెలసిన పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని ప్రచారం జరుగుతుంది.


Similar News