TGSRTC: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదని, పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా పేరెంట్ కంట్రోల్ ఫీచర్లను ఉపయోగించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.

Update: 2024-10-15 08:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదని, పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా పేరెంట్ కంట్రోల్ ఫీచర్లను ఉపయోగించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సైబర్ బానిసత్వం అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్మార్ట్ ఫోన్ల వినియోగం చిన్నారులను సైబర్ వ్యసనానికి గురిచేస్తోందని, డిజిటల్ పరికరాలను విపరీతంగా వాడటం వల్ల తెలియకుండానే పిల్లలు సైబర్ బానిసలుగా మారిపోతున్నారని తెలిపారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదని, పిల్లలు సైబర్ బానిసత్వానికి గురికాకుండా నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పిల్లలు ప్రమాదపు అంచుల్లోకి నెట్టివేయబడతారు కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పిల్లలను డిజిటల్ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా.. క్రమేపి విరామ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలని, వారిని ఆఫ్ లైన్ కార్యకలాపాలకు ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలకు డిజిటల్ విజ్ఞానం కావాల్సిందే. కానీ దానికి బానిసలు కాకుండా స్మార్ట్ ఫోన్లలో పేరెంట్ కంట్రోల్ ఫీచర్లను వినియోగించుకోవాలని సజ్జనార్ సలహా ఇచ్చారు. 


Similar News