Rahul Gandhi : నాకు అంతా తెలుసు.. T- కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్..!

విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు బహిరంగ వేదికలపై కామెంట్ చేస్తే పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2023-06-27 11:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు బహిరంగ వేదికలపై కామెంట్ చేస్తే పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, విభేదాలు వచ్చినా వాటిని నిర్దిష్ట వేదికల మీద చర్చించుకుని పరిష్కరించుకోవాలని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనని కర్ణాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని స్ట్రాటెజీ కమిటీ మీటింగ్‌లో వివరించారు.

పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో తనకు అంతా తెలుసని అన్నారు. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర నిర్దిష్ట సమాచారమే ఉన్నదని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో బైట మాట్లాడకుండా ఇన్‌చార్జితోనే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. 

Read More..

కేసీఆర్ సీఎం తెలంగాణకా.. మహారాష్ట్రకా..? YS షర్మిల ఫైర్  

Tags:    

Similar News