ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ సంచలన ప్రకటన
పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణను కేసీఆర్ రాజులా పాలిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఆయన జాగీరుగా ఫీలవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నానని అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.
భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశానని చెప్పారు. దేశం మొత్తం జోడో యాత్రను సమర్ధించిందని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, ప్రతీసారి తమను ఆదరించారని అన్నారు. రైతులు, ఆదివాసీలను కేసీఆర్ దోచుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ రంగంలో దోపిడీ జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు రావడం లేదు, సంపద పోయింది, రైతులు కన్నీరు పెడుతున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యమే అడవి బిడ్డల కోరిక అని అభిప్రాయప్డడారు. ప్రధాని మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఒకటి అనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరొకటి చేస్తోందని మండిపడ్డారు. అంతేగాక, ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
Read More..
బీఆర్ఎస్ అంటే బీజేపీ బ్రష్టాచార్ పార్టీ.. రాహుల్ గాంధీ
ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం: Ponguleti Srinivasa Reddy
పేదలకు లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. సీఎల్పీ నేత భట్టి