తెలంగాణలో ఈసారి పక్కా గెలవాలే.. రేవంత్‌కు రాహుల్ ఆదేశం

తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ పరిస్థితి ఎలా? ఉన్నదంటూ రాహుల్​గాంధీ ఆరా తీశారు. గతంతో పోల్చితే పార్టీ పుంజుకున్నదా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Update: 2022-09-19 16:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ పరిస్థితి ఎలా? ఉన్నదంటూ రాహుల్​గాంధీ ఆరా తీశారు. గతంతో పోల్చితే పార్టీ పుంజుకున్నదా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేరళలో కొనసాగుతున్న జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రాహుల్​గాంధీతో కలసి పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని రాహుల్​గాంధీ రేవంత్‌తో చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అందుకు అనుగుణంగా ప్రజా సమస్యలపై మరింత పోరాడాలని రాహుల్, రేవంత్‌కు సూచించారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షురూ అయింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే, ఈ యాత్రతో భారత భవిష్యత్ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయని కొందరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా మార్పు చూపకపోవచ్చని మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

Tags:    

Similar News