Raging: ఎస్‌ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి..?

ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని.. ఎవరైనా తమ జూనియర్లను ర్యాగింగ్ చేస్తే.. చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పించిన కొంతమంది విద్యార్థుల్లో మార్పు రావడం లేదు.

Update: 2024-08-08 04:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని.. ఎవరైనా తమ జూనియర్లను ర్యాగింగ్ చేస్తే.. చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పించిన కొంతమంది విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. చదువును మానడం చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అనేక యూనివర్సిటీ లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ లు, కమిటీలు ఏర్పాటు చేసినప్పటికి పలువురు విద్యార్థులు జూనియర్లపై రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లాలో ఉన్న ఎస్ ఆర్ యూనివర్సిటీ లో బుధవారం రాత్రి సీనియర్లు రెచ్చిపోయారు. ఇటీవల అడ్మిషన్ తీసుకున్న జూనియర్లను తమ రూమ్ లకు పిలుచుకొని ర్యాగింగ్ చేశారు. అయితే జూనియర్లలో ఓ విద్యార్థి సీనియర్లను ప్రశ్నించాడు. దీంతో వారంతా కలిసి హాస్టల్ లో జూనియర్ విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనను అదే హాస్టల్ లో ఉన్న పలువురు విద్యార్థులు తమ ఫోన్ లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఎస్ ఆర్ యూనివర్సిటీ ర్యాగింగ్ వ్యవహారాన్ని బయటకు రాకుండా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News