సార్ ప్రభుత్వంలో అన్ని లీక్‌లే అనుకుంటా..? కేసీఆర్‌పై రఘునందన్ రావు సెటైర్లు
మహారాష్ట్ర జిల్లాకు చెందిన శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రైవేటు సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ ఈనెల 2వ తేదీన జీవో విడుదల చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర జిల్లాకు చెందిన శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రైవేటు సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ ఈనెల 2వ తేదీన జీవో విడుదల చేశారు. అయితే ఈ జీవో ఆన్‌లైన్‌లో ఉంచకుండా రహస్యంగా ఉంచారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రిక్రూట్‌మెంట్ జీవో కాపీ విపక్షాలకు ఎలా అందిందనే దానిపై ప్రగతి భవన్ వర్గాలు ఆరాతీస్తున్నాయనే వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సెటైర్లు వేశారు.
ఈ విషయం అసలు బయటకు ఎలా వచ్చింది అని కేసీఆర్ ఎంక్వయిరీ చేస్తున్నారని పేర్కొన్నారు. సార్ ప్రభుత్వంలో అన్ని లీక్‌లే అనుకుంటా..? అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ చేస్తూ.. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నారని, రాష్ట్రానికి ఉత్తమ పంచాయతీ అవార్డులకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యులని తెలిపారు. వారి శ్రమ దోపిడీ చేయడం, జీతాలు సరిగా ఇవ్వకపోవడం, ప్రొబేషన్ అయిపోయి పర్మినెంట్ చేయడం లేదని ట్వీట్ చేశారు.