Raghunandan Rao: కార్యకర్త అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ ఫైర్.. పోలీస్ స్టేషన్‌లో హంగామా

బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ ఎంపీ రఘునందనరావు (Raghunandan Rao) ఫైర్ అయ్యారు.

Update: 2024-10-29 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ ఎంపీ రఘునందనరావు (Raghunandan Rao) ఫైర్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి హంగామా సృష్టించారు. సిద్ధిపేట (Siddipet) జిల్లా కుకూనూరు పల్లి పరిధిలో ఓ నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారంటూ కూల్చివేయడంతో బీజేపీ తరపున కార్యకర్తలుగా పని చేస్తున్న కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్టేషన్‌కు చేరుకున్న రఘనందనరావు.. అక్కడ బైఠాయించి ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. అనుమతులు లేని నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అరెస్ట్ (Arrest) చేస్తారంటూ నిలదీశారు. ఆయనతోపాటు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు కూడా స్టేషన్‌కు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Similar News