Kishan Reddy: ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరింది.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు.

Update: 2024-10-29 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)‌లోని బషీర్‌బాగ్ (Bashirbagh) భారతీయ విద్యా భవన్ పాఠశాల (Bharathiya Vidya Bhavan)లో నిర్వహించిన రోజ్‌గార్ మేళా (Rosegar Mela)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి నియామక పత్రాలు (Appointment Letters) అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువతను వినియోగించుకోవడం అవసరం అని అన్నారు. యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని అన్నారు.

నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ (India) ఎదిగిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సారథ్యంలో వికసిత్ భారత్ (Vikasith Bharath) దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు. దాదాపు 75 దేశాలకు ఢిఫెన్స్ పరికరాలను (Defense Equipments) ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. దేశంలో శాంతిభద్రతలను అదుపులో లేకపోతే పెట్టుబడులు రావని కామెంట్ చేశారు. ఇప్పటికే ఉగ్రవాద చర్యలపై ఉక్కుపాదం మోపామని పేర్కొన్నారు. వ్యవసాయ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. ఎక్కడా విద్యుత్ కొరత అనేది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News