బీసీ బంధు ప్రకటించాల్సిందే.. R. Krishnaiah

బీసీ బంధు ప్రకటించాల్సేందనని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2023-06-06 15:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా “బీసీ బంధు పథకం” ప్రవేశపెట్టి ఒక్కోక్క కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ నాయకులు బృందం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో మంగళవారం సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ పథకం కింద కేవలం 6 కులాలకు మాత్రమే ప్రకటించిన లక్ష రూపాయలు పథకాన్ని బీసీలోని 130 కులాలకు వర్తింపజేసి వారం రోజులలో ఈ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. బంధు పధకం ప్రవేశ పెట్టాలి లేకపోతే వచ్చే ఎన్నికలలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ చర్చల్లో భాగంగా గత ఎన్నికలకు ముందు 2018లో బీ.సి కార్పొరేషన్ ద్వారా తీసుకొని పెండింగ్ లో పెట్టిన 5 లక్షల 47 వేల ధరఖాస్తు దారులకి వెంటనే రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. విదేశ విద్య స్టైఫండ్ స్కీమ్ క్రింద అర్హులందరికీ స్టైఫండ్ ఇచ్చేందుకు బడ్జెట్ లో 60 కోట్ల నుంచి 300 కోట్లకు పెంచాలని కోరారు . ప్రతి అసెంబ్లీ నియోజకవర్గo కు అదనంగా రెండు బి.సి గురుకుల పాటశాలలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దశలవారీగా గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం క్రింద 400 కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఆపై కోర్సులు చదివే బీసీ విద్యార్థుల ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎస్.టి, ఎస్.సి , మైనారిటీ విద్యార్థులకు మాదిరిగా బిసి, ఇబిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని ,పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్ ను పెంచుతూ జి ఓ జారీ చేయాలని కోరారు.

వీటితోపాటు బీసీ స్టడీ సర్కిల్ కు 200 కోట్లు కేటాయించాలని, అర్హులందరికీ డి ఎస్ సి పొలీస్, ఎస్ ఐ గ్రూప్స్ , సివిల్స్, బ్యాంకింగ్, రైల్వే ఇతర పోటి పరిక్షలకు కోచింగ్ ఇవ్వాలని మంత్రిని కోరారు .12 బి.సి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో 2 వేల కోట్లు కేటాయించాలని చెప్పారు . కులాంతర వివాహాలు చేసుకొనే బి.సి కులాల వారికి ప్రోత్సాహక పారితోషికం 2 లక్షల 50 వేలకు పెంచాలన్నారు . బి.సి అడ్వకేట్లకు ఇచ్చే స్టై ఫండ్ నెలకు రూ.1000 నుంచి 10 వేలకు పెంచాలని ,బి.సి కాలేజి హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మని నెలకు 500 మంజూరు చేయాలని కోరారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రతి బీసీ కులానికి లక్ష రూపాయల స్కీం ఇవ్వడానికి ముఖ్యమంత్రి తో చర్చిస్తామన్నారు. అలాగే ఈ పథకాన్ని వెంటనే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని బి సి సంఘం నాయకులూ తెలిపారు . బి.సి బందు ప్రవేశ పెట్టె విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఈ చర్చల్లో బి సి సంఘం నాయకులూ గుజ్జ కృష్ణ, అంజి, వేముల రామకృష్ణ, అల్లంపల్లి రామకోటి, సతీష్, జగన్ యాదవ్, రాందేవ్ మోడి, భాస్కర్ ప్రజాపతి, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read..

CM KCR: ధరణి పోర్టల్ తో రైతులకు మేలు జరిగింది.. 

Tags:    

Similar News