ఖదీర్ ​ఖాన్‌ది ముమ్మాటికీ లాక్ ​అప్​ డెత్: వినోద్​ రెడ్డి

మెదక్ ​జిల్లాకు చెందిన ఖదీర్​ ఖాన్​ పోలీసుల అత్యుత్సాహం వలనే మరణించాడని టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ ​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-02-20 14:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ ​జిల్లాకు చెందిన ఖదీర్​ ఖాన్​ పోలీసుల అత్యుత్సాహం వలనే మరణించాడని టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ ​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ లాక్​ అప్​ డెత్​ అని స్పష్టం చేశారు. కానీ కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. లాక్ అప్ డెత్‌పై హోంమంత్రి ఇప్పటి వరకు నోరు విప్పడం లేదని ఫైర్​అయ్యారు.

కనీసం ప్రభుత్వం విచారణ కమిటీని కూడా నియమించలేకపోయిందన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. మైనారిటీలకు తానే రక్షణ అని చెప్పుకు తిరిగే అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖదీర్​ ఖాన్​ మృతిపై మాట్లాడకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. కచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ జరపాలన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు, ఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్​చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

Tags:    

Similar News